For Money

Business News

డాలర్‌తో రూపాయి 79.36

ఇంటర్‌ బ్యాంక్‌ విదేశీ మారక ద్వ్య మార్కెట్‌ (ఫారెక్స్ మార్కెట్)లో డాలర్‌తో రూపాయి మ‌రో ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. నిన్నటితో పోలిస్తే డాలర్‌తో రూపాయి మరో 41 పైస‌లు న‌ష్టపోయి 79.36 వ‌ద్ద ముగిసింది. నిన్న రూపాయి 78.95 వద్ద ముగసిఇంది.ఇవాళ ఇంట్రాడేలో రూపాయి ఇంట్రా డే ట్రేడింగ్‌లో రూపాయి 79.02-79-38 మ‌ధ్య ట్రేడ‌యింది. ముగింపులో రెండు పైసలు పెరిగి 79.36వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు, క్రూడ్‌ ధర పెరుగుతుండటంతో డాలర్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. గతంలో రూపాయి అండగా ఆర్బీఐ డాలర్లను అమ్మేది. ఇపుడు ఆ పనిచేయకపోవడంతో రూపాయి చాలా వేగంగా బక్కచిక్కిపోతోంది. ఈ నెలలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉండటంతో రూపాయి మరింత క్షీణించే అవకాశముంది.