For Money

Business News

కుప్పకూలిన రూపాయి

దేశ చరిత్రలో డాలర్‌కు రూపాయి విలువ తొలిసారి 78కన్నా దిగువకు పడిపోయింది. ఇది ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి విలువ 78 దిగువకు క్షీణించి 78.11కి చేరింది. ఇవాళ స్పాట్‌ మార్కెట్‌లో రూపాయి విలువ 28 పైసలు క్షీణించింది. గత శుక్రవారం ఒక డాలర్‌కు రూపాయి విలువ 77.83 కాగా, ఇవాళ 78.11 చేరింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌కు రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో జూన్‌ కాంట్రాక్ట్‌ 78.3950కి పడిపోయింది.అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ బలపడటంతో పాటు మన దేశీయ షేర్‌ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల కారణంగా రూపాయి బక్కచిక్కిపోయింది.