For Money

Business News

రీటైల్‌ ద్రవ్యోల్బణం షాక్‌

ఆర్థిక వేత్తల అంచనాలను మించి రీటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రభుత్వానికి పెద్ద షాక్‌ తగిలింది. ఆర్బీఐ వేసిన అంచనాలకు రీటైల్‌ ద్రవ్యోల్బణం అందనంత ఎత్తుకు ఎదిగింది. ఏప్రిల్‌ నెలలో వార్షిక ప్రాతిపదికన రీటైల్‌ ద్రవ్యల్బోణం 7.79 శాతానికి చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది.ఇది ఎనిమిదేళ్ళ గరిష్ఠ స్థాయి.
మార్చి నెలలో   6.95 శాతం మాత్రమే. గత ఏడాది అంటే 2021 ఏప్రిల్‌లో ఇదే ద్రవ్యోల్బణం 4.71 శాతంగా ఉండేది. రీటైల్‌ ద్రవ్యోల్బణం నాలుగు శాతం (రెండు శాతం అటు ఇటుగా) ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే గరిష్ఠ స్థాయిలో చూసినా ఆర్బీఐ అంచనా6 శాతం. కాని ఆర్బీఐ అంచనాలను తలకిందులు చేస్తే రీటైల్‌ ద్రవ్యోల్బణం  వరుసగా గత నాలుగు నెలలుగా పెరుగుతోంది. అనలిస్టులు కూడా ఏప్రిల్‌ రీటైల్‌ ద్రవ్యోల్బణం 7.5 శాతం ఉంటుందని అంచనా వేశారు. కాని వారి అంచనాలను కూడా మించిపోయింది. రీటైల్‌ ద్రవ్యోల్బణం భారీగా పెరగడానికి ప్రధాన కారణం ఆహార వస్తువుల ధరలు భారీగా పెరగడం. ఏప్రిల్‌ నెలలో కూడా ఈ వస్తువుల ధరలు 8.38 శాతం పెరిగాయి.