For Money

Business News

1 నుంచి …రీటైల్‌ డిజిటల్‌ రూపీ

డిసెంబర్‌ 1వ తేదీ నుంచి రీటైల్‌ మార్కెట్‌లో డిజిటల్‌ కరెన్సీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు ఆర్బీఐ ఇవాళ ఓ ప్రకటన చేసింది. అంటే డిజిటల్‌ రూపంలోనే కరెన్సీని ఆర్బీఐ విడుదల చేస్తుంది. ఇవి సాధారణ కరెన్సీ మాదిరిగానే చెల్లుబాటు అవుతాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)ని రీటైల్‌ మార్కెట్‌లోఎనిమిది బ్యాంకుల్లో ప్రవేశపెడతారు. తొలుగు నాలుగు నగరాల్లో అంటే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌లలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లలో ప్రవేశపెడతారు. రెండవ దశలో అహ్మదాబాద్‌, గాంగ్‌టక్‌, గౌహతి, హైదరాబాద్‌, ఇండోర్‌, కోచి, లక్నో, పాట్నా, సిమ్లా నగరాల్లో ప్రవేశ పెడతారు. అపుడు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లలో కూడా ఈ లావాదేవీలను అనుమతిస్తారు. ఆ తరవా బ్యాంకులు, కస్టమర్ల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ చూసి ఇతర నగరాలకు, బ్యాంకులకు విస్తరిస్తారు.