For Money

Business News

స్విగ్గి, జొమాటొ బిల్లులపై కూడా జీఎస్టీ?

ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ను కూడా రెస్టారెంట్‌ సర్వీసులుగా పరిగణించే అంశాన్ని జీఎస్‌టీ కౌన్సిల్‌ చర్చించనుంది. ఈనెల 17న సమావేశమయ్యే కౌన్సిల్‌లో ఈ అంశంపై చర్చిస్తారు. స్విగ్గి, జొమాటొ వంటి ఫుడ్‌ డెలివరీ ఈ కామర్స్‌ కంపెనీలను కూడా రెస్టారెంట్‌ సర్వీసుగా వర్గీకరించి వాటి సేవలపై జీఎస్టీ విధించాలని ఫిట్‌మెంట్‌ కమిటీ ప్రతిపాదించింది. జొమాటొ సేవలపై జీఎస్టీ వేసేందుకు అంగీకరిస్తే… ఆయా కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసుకునేందుకు వచ్చే జనవరి 1 వరకు సమయం ఇవ్వాలని కూడా ఫిట్‌మెంట్‌ కమిటీ ప్రతిపాదించింది.