For Money

Business News

రిలయన్స్‌ మెట్రో ఆఫర్‌ రూ.5600 కోట్లు?

జర్మనీకి చెందిన హోల్‌సేల్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ కంపెనీ మెట్రో కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.5600 కోట్ల బిడ్‌ వేసినట్లు తెలుస్తోంది. భారత మార్కెట్‌ నుంచి వైదొలగాలని మెట్రో నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశీయంగా దేశీ,స్వదేశీ నినాదాం పెరగడంతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై భారత దర్యాప్తు అధికారుల వైఖరి కూడా మారడంతో … భారత మార్కెట్‌కు గుడ్‌ బై చెప్పాలని మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ నిర్ణయించింది. మెట్రో వ్యాపారం కోసం అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి. రిలయన్స్‌తో పాటు థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఛరోన్‌ పోక్‌ఫండ్ గ్రూప్‌ ఆస్తుల కోసం ప్రయత్నిస్తోంది. ఈ కంపెనీ ఆఫర్‌ పట్ల మెట్రో మొగ్గు చూపే అవకాశముంది.