For Money

Business News

రియల్‌ ఎస్టేట్‌: ధరలు 5 % పెరుగుతాయి

వచ్చే ఏడాదిలో రియల్‌ ఎస్టేట్‌ ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడించింది. కరోనాతో ఈ ఏడాది ఆటుపోట్లు ఎదుర్కొన్న స్థిరాస్థి రంగం వచ్చే ఏడాది స్థిరంగా ఉండొచ్చని పేర్కొంది. ‘2022 అవుట్‌లుక్‌ రిపోర్ట్‌’ లో ఈ వివరాలను పేర్కొంది. ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు అధికంగా ఉన్నందున ఆఫీసు స్థలానికి వచ్చే గిరాకీ పెరుగుతుందని పేర్కొంది. ‘ఫ్లెక్సిబుల్‌ ఆఫీసు స్పేస్‌’ కు గిరాకీ ఇంకా అధిక గిరాకీ ఉంటుందని వివరించింది. సాధారణ ఇళ్ళకు బదులు విశాలంగా, అధునాతన సదుపాయాలు కల ఇళ్లను వినియోగదార్లు ఇష్టపడుతున్నారని నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడించింది. దేశంలోని 5 అతిపెద్ద ఐటీ కంపెనీలు ఇటీవల కాలంలో 2.60 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాయని, వీరిలో కొత్తగా ఉద్యోగం పొందే వారి సంఖ్య 2.08 లక్షల వరకు ఉంటుదని అంచనా వేసింది. వీరంతా కార్యాలయాలకు వస్తే అదనంగా 1.16 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలం కావాల్సి వస్తుంది. వచ్చే రెండేళ్లలో ఈ స్థలం అవసరం. ‘ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌’ కు గిరాకీ పెరిగడమే గాని అవకాశం లేదని పేర్కొంది. ఆఫీసు స్థలా అద్దెలు పెరిగే అవకాశం ఉందని, ఇ-కామర్స్‌ విస్తరణ వల్ల గోడౌన్లకు డిమాండ్‌ వస్తుందని పేర్కొంది. అలాగే దేశీయ డేటా కేంద్రాల వ్యాపారం పెరుగుతోందని… దీని కోసం ఆఫీసు స్థల డిమాండ్‌ కూడా పెరుగుతుందని అంచనా వేస్తోంది.