For Money

Business News

వడ్డీ రేట్లు మారకపోవచ్చు

దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్నా.. ఆర్బీఐకి మాత్రం కన్పించడం లేదు. ఈసారి కూడా వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని బ్యాంకింగ్‌ వర్గాలు అంటున్నాయి. రెండు నెలలకు ఒకసారి పరపతి విధానాన్ని సమీక్షించే కమిటీ ఈ శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. మూడు రోజుల సమీక్ష తరవాత నిర్ణయాన్ని వెల్లడిస్తారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో దేశ ఆర్థిక పరస్థితిని ఆర్బీఐ కమిటీ సమీక్షించనుంది. ప్రపంచం దేశాలన్నీ ద్రవ్యోల్బణానికి వెంటనే స్పందిస్తున్నాయి. ఇటీవలే వడ్డీ రేట్లను పెంచిన అమెరికా వచ్చే నెలలో 0.5 శాతం పెంచే అవకాశముంది.అయితే వడ్డీ రేట్లను పెంచితే… పారిశ్రామిక రంగం ఇబ్బంది పడుతుందని, వృద్ధి రేటు దెబ్బతింటుందని ఆర్బీఐ భావిస్తోందని బ్యాంకర్లు భావిస్తున్నారు. దీంతో వడ్డీ రేట్లను మార్చే అవకాశాలు లేవని చెబుతున్నారు.