For Money

Business News

స్మాల్‌ సేవింగ్స్‌పై వడ్డీలో భారీ కోత?

వివిధ రకాల చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లున భారీగా తగ్గించాలని భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అభిప్రాయపడుతోంది. ఇటీవల కొన్ని బ్యాంకులు సేవింగ్‌ డిపాజిట్స్‌పై వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఇలాంటి సూచన చేయడం విశేషం. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై ఇపుడు ఉన్న వడ్డీ రేట్లను 0.9 శాతం నుంచి 1.11 శాతం మేరకు తగ్గించాలని ఆర్బీఐ పేర్కొంది. దేశ ఆర్థిక స్థితి అనే పేరుతో తయారు చేసిన నివేదికలో ఆర్బీఐ ఈ విషయాన్ని పేర్కొంది. ఈనెల 31వ తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి వడ్డీ రేట్లను ప్రభుత్వం ఖరారు చేయనున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ సూచన చేయడం విశేషం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి ఖాతా (SSA), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లపై మార్చి 31న కొత్త వడ్డీ రేట్లను ఖరారు చేయనున్నారు. PPFపై ఇపుడు 7.10 శాతం, SCSSపై 7.40 శాతం, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లపై 5.5-6.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేట్లు జనవరి 1, 2021 నుండి మార్చి 31, 2022 మధ్య కాలానికి అమల్లో ఉన్నాయి.