For Money

Business News

HYD: కంట్రోల్‌-ఎస్‌ డాటా సెంటర్‌

హైదరాబాద్‌, గచ్చిబౌలిలో తమ మూడో డాటా సెంటర్‌ నిర్మాణానికి కంట్రోల్‌-ఎస్‌ కంపెనీ భూమి పూజ చేసింది. ఈ కొత్త డాటా సెంటర్‌ను హైపర్‌స్కేల్‌ డాటా సెంటర్‌గా నిర్మిస్తున్నారు. సుమారు 1,31,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 18 మెగావాట్ల విద్యుత్తుతో నడిచేలా తీసుకొస్తున్నారు. మొత్తం ఇక్కడ 1,600 ర్యాక్‌లుంటాయి. ఈ సందర్భంగా కంట్రోల్‌-ఎస్‌ కంపెనీ వ్యవస్థాపకులు, సీఈవో శ్రీధర్‌ పిన్నపురెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న డాటా సెంటర్‌ మూడవదని, ఇది ఫోర్‌ రేటింగ్‌ కలిగిన హైపర్‌స్కేల్‌ డాటాగా ఉంటుందన్నారు.