For Money

Business News

140 రోజుల తరవాత పెట్రో బాదుడు షురూ

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న చమురు సంస్థలు ప్రకటించాయి. పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పెరిగిన పెట్రల్, డీజిల్ ధరలు అమల్లోకి వచ్చాయి. గతేడాది నవంబర్‌ తర్వాత పెరగడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.108.20, డీజిల్‌ ధర రూ.94.62గా ఉంది. పెరిగిన ధరలతో పెట్రోల్ ధర రూ.109.10, డీజిల్ 95.49కు చేరింది.