For Money

Business News

జీడీపీ వృద్ధి రేటు తగ్గించిన ఆర్బీఐ

దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఆర్బీఐ తగ్గించింది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ఇవాళ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ జూన్‌ – సెప్టెంబర్‌ మధ్య కాలంలో వాస్తవ జీడీపీవృద్ధి రేటు 6.3 శాతం ఉన్నా… అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో వృద్ధి రేటు కేవలం 4.6 శాతం మాత్రమే ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 7.2 శాతానికి ఇది వరకే ఆర్బీఐ తగ్గించింది. దీన్ని ఇవాళ ఏడు శాతానికి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సతరానికి ద్రవ్యోల్బణ రేటు 6.7 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువకు సంబంధించి ఆర్బీఐకి ఎలాంటి టార్గెట్‌ లేదని అన్నారు. డాలర్‌తో రూపాయి విలువ ఫలానా స్థాయిలో ఉండాలని ఆర్బీఐ అనుకోలేదని ఆయన అన్నారు.