For Money

Business News

ఎలక్ట్రిక్‌ నానో కారులో టాటా

కొయంబత్తూరుకు చెందిన ఎలక్ట్రా ఈవీ కంపెనీ తాను అభివృద్ధి చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాన్ని తన సంస్థ సహ యజమాని రతన్‌ టాటాకు అందజేసింది. ఈవీల పవర్‌ స్ట్రయిన్‌ సొల్యూషన్స్‌ను అందించే ఈ కంపెనీ నానో కార్లను రీ డైజన్‌ చేసి ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తోంది. టాటా మోటార్స్ నుంచి నానోను కోయంబత్తూరు కంపెనీ కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి రతన్‌ టాటా నిధులు సమకూర్చారు. కోయంబత్తూరు కంపెనీ అభివృద్ధి చేసిన 72వీ నానో విద్యుత్‌ కారు ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 160 కి.మీ. దూరం ప్రయాణం చేయొచ్చు.