For Money

Business News

3 రోజుల్లో 70% జంప్‌..అమ్మేవారు లేరు

అదానీ పవర్‌ ఏమిటో స్టాక్‌ మార్కెట్‌లో మరోసారి నిరూపతమైంది. జెట్‌ స్పీడుతో రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీని గౌతమ్‌ అదానీ దాటడంలో ఆయన కంపెనీల షేర్లు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా మూడు రోజుల క్రితం లిస్టయిన అదానీ విల్మర్‌ జెట్‌ స్పీడుతో దూసుకెళుతోంది. ఈ కంపెనీ ఇష్యూకు పెద్ద ఆదరణ లభించలేదు. తొలిరోజే నష్టాలతో లిస్టయింది. రూ. 230లకు షేర్లను ఆఫర్‌ చేస్తే… లిస్టింగ్‌ రోజున ఓపెనింగ్‌లో రూ.227ని తాకింది. కాని ట్రేడింగ్‌ కొనసాగేకొద్దీ అదే రోజూ పెరుగుతూ వచ్చి లాభాల్లో ముగిసింది.ఇదే సమయంలో మార్కెట్‌లో వంటనూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయని వార్తలు కూడా రావడంతో ఇన్వెస్టర్లు వేలం వెర్రిగా షేర్లను కొంటున్నారు. అదానీ విల్మర్‌ ఫార్చ్యూన్‌ బ్రాండ్‌తో వంటనూనెలు అమ్ముతున్న విషయం తెలిసిందే. దీంతో మూడు రోజుల్లోనే రూ.227 నుంచి రూ. 386కి పెరిగింది. అంటే మూడు రోజుల్లో 70శాతంపైన లాభమన్నమాట. ఇవాళ ఈ షేర్‌ ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం అప్పర్‌ సీలింగ్‌తో రూ.386.25 వద్ద ఉంది. ఈ ధర వరకు 27 లక్షల షేర్లకు కొనుగోలుదారులు ఉన్నా.. అమ్మేవారు లేరు.