For Money

Business News

రెయిన్‌ ఇండస్ట్రీస్‌…నష్టాల వాన

స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు డార్లింగ్ షేర్‌గా పేరొందిన హైదరాబాద్‌కు కంపెనీ రెయిన్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ ఇవాళ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది. డిసెంబర్‌తో ముగిసిన ఏడాదికి కంపెనీ పనితీరు నిరాశాజనకంగా ఉండటంతో ఇవాళ అమ్మకాలు వెల్లువెత్తాయి. మార్కెట్‌ కూడా భారీ నష్టాల్లో ఉండటంతో రెయిన్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 15 శాతం తగ్గి రూ. 171.35ని తాకింది. తరవాత మార్కెట్‌ కోలుకోవడంతో ఈ షేర్‌ కూడా కోలుకుని 8 శాతం నష్టంతో రూ. 183 వద్ద ముగిసింది. గత ఏడాదితో పోలిస్తే డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 52 శాతం పెరిగి రూ. 4026 కోట్లకు చేరినా… కంపెనీ రూ.97 కోట్ల నికర నష్టం ప్రకటించడంతో ఇన్వెస్టర్లు కంగుతిన్నారు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 307 కోట్ల నికర లాభం ప్రకటించింది.