For Money

Business News

పారిశ్రామిక వేత్తలకు మోడీ మరో వరం

కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో కేబినెట్‌ ఇవాళ సమావేశం కానుంది. రైల్వే వద్ద ఉన్న భూముల మరింత తక్కువ రేటుకు లీజుకు ఇచ్చేందుకు ఆమోదం తెలుపనుంది. దీనికి గాను రైల్వే ల్యాండ్‌ లైసెన్స్‌ ఫీ పాలసీకి సవరణలు చేయనుంది. ప్రస్తుతం పారిశ్రామిక అవసరాల కోసం రైల్వే భూమిని కేటాయిస్తే ల్యాండ్‌ లైసెన్స్‌ ఫీజు కింద ఆరు శాతం వసూలు చేస్తున్నారు. దీన్ని రెండు లేదా మూడు శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే ఇపుడు అయిదేళ్ళ కాలానికి లీజుకు ఇస్తుండగా.. దీన్ని 35 ఏళ్ళకు పెంచనున్నారు. అలాగే కాంకార్డ్‌ కంపెనీ డిజిన్వెస్ట్‌మెంట్‌కు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశముంది.