For Money

Business News

15850పైన నిఫ్టి

నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 15816 పాయింట్లను తాకిన నిఫ్టి వెంటనే కోలుకుని ఇపుడు 15878 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 68 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టికి నిఫ్టి బ్యాంక్‌ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ కూడా 0.67 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్‌ మాత్రం స్వల్ప లాభాలతో ఉంది. నిఫ్టిలో 32 షేర్లు లాభాలతో ఉన్నాయి. క్రూడ్‌ భారీగా క్షీణించడంతో ఏషియన్‌ పెయింట్ షేర్‌ 3 శాతంపైగా లాభపడింది. బీపీసీఎల్‌ కూడా రెండు శాతం లాభంతో ఉంది. ఇక నష్టాల్లో ఓఎన్‌జీసీ ముందుంది. క్రూడ్‌ ధరలు తగ్గడమే దీనికి కారణం. ఏకంగా 5 శాతం క్షీణించింది. 52 వారాల కనిష్ఠ స్థాయికి ఈ షేర్‌ చేరింది. ఈ ఏడాది మార్చి రూ. 194 వద్ద ఈ షేర్‌ ట్రేడైంది. మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. డాలర్‌ భారీ బలపడటమే దీనికి కారణం. డిజిన్వెస్ట్‌మెంట్‌కు కేంద్ర కేబినెట్‌ ఇవాళ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందన్న వార్తలతో కాంకర్డ్‌ షేర్‌ ధర అయిదు శాతం పెరిగింది.