For Money

Business News

నిరాశపర్చిన రిలయన్స్‌ ఫలితాలు

మార్కెట్‌ ఎంతో ఆశతో ఎదురు చూసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలు వచ్చాయి. కాని ఇన్వెస్టర్లను నిరశాపర్చాయి. మార్కెట్‌ అంచనాలను అందుకోవడంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విఫలమైంది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.2,11,887 కోట్ల టర్నోవర్‌పై రూ. 16,203 కోల్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 1,54,896 కోట్ల ఆదాయంపై రూ. 13,227 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే టర్నోవర్‌ 36.79 శాతం, నికర లాభం 22.50 శాతం పెరిగింది. అయితే కంపెనీ రూ. 16,674 కోట్ల నికర లాభం వస్తుందని మార్కెట్‌ ఆశించింది.
గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆపరేటింగ్‌ మార్జిన్‌ 10.6 శాతం ఉండగా, ఈసారి 10.1శాతానికే పరిమితమైంది. నికర లాభ మార్జిన్‌ కూడా 9.8 శాతం నుంచి 7.7 శాతానికి పడిపోయింది. రిలయన్స్‌ రీటైల్‌ రూ.58017 కోట్ల ఆదాయంపై రూ. 2139 కోట్ల నికర లాభం ఆర్జించింది. రిలయన్స్‌ జియో రూ. 26,139 కోట్ల ఆదాయంపై రూ.4,313 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఆయిల్‌ కెమికల్స్‌ విభాగంలో ఆదాయం 44 శాతం పైగా పెరిగింది.