For Money

Business News

నిలకడగా సూచీలు

నిన్నటి భారీ పతనం తరవాత వాల్‌స్ట్రీట్‌ ఇవాళ నిలకడగా ఉంది. దాదాపు అన్ని సూచీలు క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. అన్ని ప్రధాన ఐటీ, టెక్‌ కంపెనీల షేర్లు గ్రీన్‌లో ఉన్నా.. ఒక్కటీ రెండు శాతం మించి లాభాలు పొందలేదు. డాలర్‌ ఇవాళ స్వల్పంగా క్షీణించడం మార్కెట్‌కు పాజిటివ్‌ అనొచ్చు. అయితే ఈక్విటీ మార్కెట్‌ నిద్రలేని రాత్రులు మిగుల్చతున్నది బాండ్‌ ఈల్డ్స్‌. ఇవాళ కూడా పదేళ్ళ ట్రెజరీ బాండ్స్‌పై ఈల్డ్స్‌ 3.105కు చేరాయి. మరోవైపు క్రూడ్‌ ఆయిల్‌ భారీ పెరగడం కూడా మార్కెట్‌ పరుగులకు బ్రేక్‌ వేస్తోంది. అమెరికాతో పాటు యూరప్‌ దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు ఇప్పట్లో లాభాల్లో రావడం కష్టమని అనలిస్టులు అంటున్నారు. మరోవైపు ఒక మోస్తరు నష్టాలతో మొదలైన యూరప్‌ మార్కెట్లన్నీ భారీ నష్టాలతో ముగిశాయి.