For Money

Business News

కీలక ఔషధాల ధరలకు రెక్కలు

జ్వరం, ఇన్‌ఫెక్షన్‌, గుండె జబ్బు, బీపీ, చర్మ వ్యాధులు, అనీమియాతో సహా పలు నిత్యావసర ఔషధాల ధరలు ఈ ఏడాది పెరగనున్నాయి. నిత్యావసర ఔషధనాల జాతీయ జాబితాలో ఉన్న ఈ ఔషధాల ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. వీటి ధరలు ఏటా టోకు ధరల సూచీ ఆధారంగా ఎంత ద్రవ్యోల్బణం పెరిగితే… ఆ మేరకు పెంచుతారు. గత కొన్నేళ్ళుగా ద్రవ్యోల్బణ అదుపులో ఉండేది. గత ఏడాది జనవరిలో టోకు ధరల ద్రవ్యోల్బణ సూచీ (WPI) కేవలం 2.5 శాతం ఉండేది.కాని తరవాత ఏడాది అంతా రెండంకెల్లో ఉంది.ఈ ఏడాది జవనరిలో WPI 12.96 శాతానికి చేరింది. దీంతో ఈ ఔషధాల ధరలు కూడా పెరగనున్నాయి. కనీసం పది శాతం వీటి ధరలు పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.