For Money

Business News

రాకేష్‌ షేర్లలో ఒత్తిడి

బిగ్ బుల్ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మృతి తరవాత ఆయనకు వాటా ఉన్న షేర్లలో ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా ఇటీవల లిస్టయిన షేర్లలో ఈ ఒత్తిడి అధికంగా ఉంది. దాదాపు 32కు పైగా కంపెనీల్లో రాకేష్‌కు వాటా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పెట్టుబడి పెట్టి మెట్రో బ్రాండ్‌ షేర్లలో ఒత్తిడి అధికంగా ఉంది.కాని దిగువ స్థాయిలో భారీగా కోలుకుంది. ఓపెనింగ్‌లో రూ. 871.60 స్థాయికి చేరిన ఈ షేర్‌ తరవాత అమ్మకాల ఒత్తిడి తరవాత రూ. 826.45కు పడిపోయింది. కాని వెంటనే వచ్చిన మద్దతుతో షేర్‌ క్రితం ముగింపు రూ. 855ను దాటి గ్రీన్‌లోకి వచ్చింది. అయితే ఈ షేర్‌లో ట్రేడింగ్‌ చాలా జోరుగా సాగుతోంది. ఈ షేర్‌ ఇపుడు రూ. 847 వద్ద ట్రేడవుతోంది. అలాగే ఆయనకు వాటా ఉన్న నజారియా టెక్నాలజీ షేర్‌ రూ.8.65 తగ్గి రూ.634.45కు చేరింది. ఇక టైటాన్‌ షేర్‌ రూ.21 తగ్గి రూ. 2450 వద్ద ట్రేడవుతోంది. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌షేర్‌ కూడా రూ.3.35 నష్టపోయి రూ. 278 వద్ద ట్రేడవుతోంది. అయితే చాలా వరకు ఈ కంపెనీ షేర్లలో నష్టాలు పరిమితంగా ఉన్నాయి.