For Money

Business News

అదరగొట్టిన మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌

సాధారణ బ్లాక్‌ డీల్ జరిగితే షేర్‌పై ఒత్తిడి బాగా ఉంటుంది. పైగా కంపెనీ ఈక్విటీలో 27 శాతం వాటా చేతులు మారితే షేర్‌ ధరలో భారీ హెచ్చుతగ్గులు ఉంటాయి. మ్యాక్స్‌ హెల్త్‌ కేర్‌లో ఇవాళ ఏకంగా 26 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఒక్కో షేర్‌ రూ. 355లకు డీల్‌ కుదిరింది. దీంతో ఈ డీల్ ధర వరకు ఈ షేర్‌ తగ్గింది. మ్యాక్స్‌ క్రితం ముగింపు రూ. 361.90 కాగా… ఇవాళ ఓపెనింగ్‌లోనే బ్లాక్‌ డీల్‌ పూర్తి కావడంతో షేర్‌ రూ. 354.10కి తగ్గింది. డీల్‌ పూర్తయిన వెంటనే పెరగడం ప్రారంభమైంది. క్రితం ముగింపుతో పోలిస్తే షేర్‌ రూ. 13 పెరిగి ఇపుడు రూ. 374.90 వద్ద ట్రేడవుతోంది. బ్లాక్‌ డీల్‌ కింద అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్ ఈ షేర్లను అమ్మింది. మరి ఎవరు కొనుగోలు చేశారో ఇంకా వెల్లడి కాలేదు. ఈ డీల్‌ విలువ రూ. రూ .9,290 కోట్లు. ఈ షేర్లను 2018లో కేకేఆర్‌ రూ. 80 ధర వద్ద కొనుగోలు చేసింది. ఇపుడు ఒక్కో షేర్‌ను రూ. 355 చొప్పున విక్రయించింది.