For Money

Business News

భారీగా క్షీణించిన వెండి.. వాల్‌స్ట్రీట్‌

అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లలో డాలర్‌ మరింత బలపడుతోంది. నవంబర్‌కల్లా ఉద్దీపన ప్యాకేజీని క్రమంగా తగ్గిస్తారన్న వార్తలతో డాలర్‌ బలం పెరుగుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 93ని దాటింది. ఈ నేపథ్యంలో వాల్‌ స్ట్రీట్‌లో లాభాల స్వీకరణ జోరుగా ఉంది. నాస్‌డాక్‌ దాదాపు ఒకశాతం దాకా క్షీణించింది. డౌజోన్స్‌ అరశాతం క్షీణిస్తే… ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.7 శాతం క్షీణించింది. డాలర్‌ కారణంగా క్రూడ్‌ కూడా ఒక శాతంపైగా క్షీణించింది. ఇక బులియన్‌ మార్కెట్‌ బంగారం కాస్త నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఔన్స్‌ బంగారం ధర 1750 డాలర్ల దిగువకు వస్తే.. మంచి సపోర్ట్‌ లెవల్‌ పోయినట్లే. అందుకే ఆ స్థాయిలో ట్రేడవుతోంది. కాని వెండి మాత్రం ఒకటిన్నర శాతం నష్టంతో 22.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మన ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం కేవలం రూ. 96 తగ్గి రూ.45,980 వద్ద ట్రేడవుతోంది. అయితే వెండి మాత్రం రూ. 927 తగ్గి రూ. 60,150 వద్ద ట్రేడవుతోంది.