For Money

Business News

పఠాన్‌ ప్రపంచ రికార్డు

చైనా విడుదలతో నిమిత్తం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన బాలీవుడ్‌ మూవీగా పఠాన్‌ రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇప్పటి వరకు 10.3 కోట్ల డాలర్ల (సుమారు రూ. 850 కోట్లు) కలెక్షన్స్‌ సాధించినట్లు డెడ్‌లైన్‌ పత్రిక పేర్కొంది. దేశీయంగా కూడా బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన రెండో చిత్రంగా పఠాన్‌ నిలిచింది. ఇప్పటి ఈ రికార్డు కేజీఎఫ్‌2పై ఉంది. ఇపుడు నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న బాహుబలి2 రికార్డు దిశగా పఠాన్‌ పయనిస్తోంది. దేశీయంగా ఇప్పటి వరకు హిందీ వెర్షన్‌ రూ. 430.25 కోట్లు వసూలు చేసింది. తెలుగు , తమిళ భాషల్లో ఈ సినిమా కలెక్షన్స్‌ రూ.15.95 కోట్లకు చేరింది. దీంతో దేశీయంగా బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ రూ.446.20 కోట్లకు చేరింది. ఇదే ట్రెండ్‌ కొనసాగే పక్షంలో పఠాన్‌ మూవీ త్వరలోనే బాహుబలి2 రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి.