For Money

Business News

17800పైన నిఫ్టి

ఓపెనింగ్‌లో 17744ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 17808 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 87 పాయింట్ల లాభంతో నిఫ్టి ఉంది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. అదానీ గ్రూప్‌ షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఇవాళ పది శాతం అప్పర్‌ సర్క్యూట్‌లో ట్రేడవుతోంది. అలాగే ఇతర అదానీ గ్రూప్‌ షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. అదానీ టోటల్‌ మాత్రం అయిదు శాతం లోయర్‌ సీలింగ్‌లో ఉంది. నిఫ్టిలో 38 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్‌ కూడా ఒక మోస్తరు లాభాల్లో ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ ఫలితాల తరవాత ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నారు. అలాగే హరో మోటార్స్‌ కూడా. బజాజ్‌ ఆటో కూడా నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఉంది. నిఫ్టి టాప్‌ గెయినర్‌లో అదానీ ఎంటర్‌ప్రైజస్‌, అదానీ పోర్ట్స్‌ ఉన్నాయి. ఇవాళ నిఫ్టి నెక్ట్స్‌ షేర్లు మంచి ఊపు మీద ఉన్నాయి. జొమాటోతో పాటు పే టీఎం షేర్లు ఆరుశాతంపైగా లాభాల్లో ఉన్నాయి. నైకా కూడా నాలుగు శాతం లాభపడింది.