For Money

Business News

గరిష్ఠ స్థాయిల వద్ద ముగిసిన నిఫ్టి

ఇవాళ స్టాక్‌ మార్కెట్‌ ఆరంభం నుంచి చివరిదాకా పటిష్ఠంగా లాభాల్లో కొనసాగింది. ఆరంభంలో 17744 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకినా.. ఆ తరవాత క్రమంగా లాభాల్లో అదరగొట్టింది. క్లోజింగ్‌కు ముందు 17898 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి క్లోజింగ్‌లో 17871 వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి ఒక్కటే స్వల్ప లాభాలకు పరిమితమైంది. మిగిలిన ప్రధాన సూచీలన్నీ ఒక శాతం దాకా లాభపడ్డాయి. ముఖ్యంగా న్యూఏజ్‌ షేర్లకు ఎక్కువ వెయిటేజీ ఉన్న నిఫ్టి నెక్ట్స్‌ 0.89 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టిలో కూడా అదానీ ఎంటర్‌ప్రైజస్‌ 23 శాతం, అదానీ పోర్ట్స్‌ 9 శాతం లాభంతో ముగిశాయి. బడ్జెట్‌ తరవాత ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు కూడా ఇవాళ ఆకర్షణీయ లాభాల్లో ముగిశాయి. నిఫ్టి నెక్ట్స్‌లో పేటీఎం 15 శాతం పైగా లాభపడింది. అలాగే జొమాటొ 9 శాతం, నైకా 6 శాతం లాభంతో ముగిశాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 5 శాతం లాభపడింది. అయితే అదానీ టోటల్‌, అదానీ ఎనర్జి షేర్లు 5 శాతం చొప్పున నష్టంతో ముగిశాయి. ఏసీసీ స్వల్ప నష్టాలతో ముగిశాయి.