For Money

Business News

చంద్రశేఖరన్‌కు పద్మ భూషణ్‌

టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌కు పద్మ భూషణ్‌ అవార్డు లభించింది. భారత పారిశ్రామిక రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారం దక్కింది. 2017లో ఆయనకు టాటా సన్స్‌ పగ్గాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్‌)తో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రశేఖరన్‌.. అంచెలంచెలుగా ఎదుగుతూ 2009లో అదే కంపెనీకి సీఈఓ అయ్యారు. తరవాత టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌కు సారథ్యం వహిస్తున్నారు. ఈ స్థానంలో నియమితులైన తొలి పార్శీయేతర వ్యక్తి ఈయనే కావడం విశేషం. ప్రస్తుతం ఆయన భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కేంద్ర బోర్డు డైరెక్టర్‌గానూ సేవలందిస్తున్నారు.