For Money

Business News

ఈసారి డివిడెంట్‌ లేనట్లే!

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వానికి, తన వాటాదారులకు డివిడెండ్‌ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించిన ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో కూడా నష్టాలను ప్రకటించే అవకాశముంది. గతంలో ఒక్కో లీటర్‌కు రూ. 38 నుంచి రూ. 40 నష్టం వస్తుండగా.. ఇపుడు రూ. 18వస్తోందని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు అంటున్నారు. ఇప్పటికీ నష్టాలతో డీజిల్, పెట్రోల్‌ అమ్ముతున్నందున… డివిడెండ్‌ ప్రకటించే అవకాశాలు లేవని ఆ కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్రానికి తెలిపినట్లు పెట్రోలియం శాఖ వర్గాలు అంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని… కాబట్టి ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలకు ఇప్పట్లో లాభాలు రావడం కూడా కష్టమేనని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.