For Money

Business News

ఒక్క ఉద్యోగి ఉన్నా.. ఈపీఎఫ్‌లోకి?

ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ స్కీమ్‌లో ఏదేనా కంపెనీ చేరాలంటే…ఆ సంస్థలో కనీసం 20 మంది ఉద్యోగులు ఉండాలి. అలాగే రూ. 15,000 వేతన సీలింగ్‌ కూడా ఉంది. ఈ రెండింటిని ఎత్తివేయాలని ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) ప్రతిపాదించింది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సంఖ్యపై ఇపుడున్న పరిమితి ఎత్తివేస్తే… స్వయం ఉపాధి చేసుకుంటున్నవారు కూడా ఈపీఎఫ్‌లో చేరే అవకాశముందని ఈపీఎఫ్‌ఓ అంటోంది. అలాగే యజమాని తరఫు నుంచి మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాల్సిన పనిలేదన్న షరతుతో ఉద్యోగులందరినీ ఈపీఎఫ్‌లో చేరేలా అనుమతించాలని కూడా కోరుతోంది. దీని వల్ల భారీ సంఖ్యలో ఈపీఎఫ్‌ సభ్యుల సంఖ్య పెరుగుతుందని… వారి ద్వారా వచ్చే మొత్తం కూడా పెరుగుతుందని ఈపీఎఫ్‌ఓ అంటోంది. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లలో మరింత పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇపుడు తన నిధుల్లో 15 శాతం మొత్తాన్ని ఈక్విటీల్లో పెట్టుబడి పెడుతున్నారు. దీన్ని 25 శాతానికి పెంచాలని ఈపీఎఫ్‌ఓ కోరుతోంది.