For Money

Business News

దుమ్ము రేపుతున్న మార్కెట్లు

ఉదయం నుంచి ట్రేడింగ్‌ సెషన్‌ కొనసాగే కొద్దీ నిఫ్టి బలపడుతోంది. ఉదయం 17401 పాయింట్లను తాకిన నిఫ్టి… అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ 17659 పాయింట్లను తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 331 పాయింట్లు పెరిగి 17644 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్‌ రికార్డు స్థాయిలో 2.41 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్‌ కూడా రెండు శాతం లాభంతో ఉంది. నిఫ్టిలో 49 షేర్లు లాభాల్లో ఉండగా, ఒక్క షేర్‌ నిలకడగా ఉంది. ఒక్క షేర్‌ కూడా నష్టాల్లో లేదు. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 5 శాతం దాకా లాభాల్లో ఉంది. టెక్‌ మహీంద్రా 4 శాతం పైగా లాభపడగా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 3.73 శాతం లాభంతో ఉంది. ఇవాళ అదానీ గ్రూప్‌ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. కొన్ని షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని కూడా తాకాయి. నిఫ్టి నెక్ట్స్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్‌, డీఎల్‌ఎఫ్‌. నౌకరి టాప్‌ గెయినర్స్‌లో ముందున్నాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ పేజ్‌ ఇండస్ట్రీస్‌ నాలుగు శాతం పెరగడం విశేషం. ఎన్‌డీటీవీ షేర్‌ ఇవాళ కూడా అప్పర్‌ సర్క్యూట్‌లో ఉంది. ఇవాళ 5 శాతం పెరిగి రూ. 471.50 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర వద్ద ఎన్ఎస్‌ఈలో 3 లక్షలకు పైగా షేర్లకు కొనుగోలుదారులు ఉన్నారు. కానీ అమ్మేవారు లేరు.