For Money

Business News

నిఫ్టి సూపర్ ఓపెనింగ్‌

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా భారీ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17459 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 17438 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 125 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 384 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి బ్యాంక్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. అత్యధికంగా నిఫ్టి నెక్ట్స్ 1.29 శాతం లాభంతో ఉంది. నిఫ్టిలో ఏకంగా 47 షేర్లు లాభాల్లో ఉన్నాయి. కేవలం మూడు షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఏజీఎంలో మెరుపులు లేకపోవడంతో రిలయన్స్‌ షేర్‌ ఇవాళ నష్టాలతో ప్రారంభమైంది. భారతీ ఎయిర్‌ టెల్‌ టాప్‌ లూజర్‌గా ఉంది. ఇక టాప్‌ గెయినర్స్‌ లిస్ట్‌ బజాజ్‌ ట్విన్స్‌ టాప్‌లో ఉన్నాయి. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ నాలుగు శాతంపైగా లాభపడగా, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.33 శాతం లాభపడింది.