For Money

Business News

500 మంది టెకీల‌పై వేటు?

ఓలా కంపెనీ దాదాపు 500 మంది ఉద్యోగుల‌ను విధుల నుంచి తొల‌గించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సాఫ్ట్‌వేర్ టీములకు చెందిన‌ ఉద్యోగుల‌పై ఓలా వేటు వేయ‌వ‌చ్చని వార్తలు వస్తున్నాయి. పున‌ర్‌వ్యవస్ధీక‌ర‌ణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది. వీరిలో చాలా మంది ఓలా యాప్‌పై వ‌ర్క్ చేస్తున్న టెకీల‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల లాంఛ్ చేసిన‌ ఓలా ఎస్‌1 ప్రొ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వర్షకాలంలో ఈ వాహనాలు తగలబడటంతో… దేశ వ్యాప్తంగా అన్ని బ్రాండ్ల సేల్స్ తగ్గిపోతున్నట్లు సమాచారం. ఓలా ఈవీల అమ్మకాలు కూడా ప‌డిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులపై వేటు వేయాలని కంపెనీ నిర్ణయించిందని సమాచారం. అయితే కంపెనీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కంపెనీలో 2000 మంది ఇంజ‌నీర్లు ఉన్నారు. మరో 18 నెల‌ల్లో వీరి సంఖ్యను 5000కు పెంచుతామ‌ని కంపెనీ అంటోంది. అయితే ఈలోగా పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టింది. ఇటీవ‌ల త‌న ప్రీ ఓన్డ్‌ (సెకండ్‌ హ్యాండ్‌) కార్ల వ్యాపారానికి చెందిన 2000 మంది ఉద్యోగుల‌ను కంపెనీ తొల‌గించింది.