For Money

Business News

ఓయో IPO: తాజా పత్రాలు దాఖలు

పబ్లిక్‌ ఇష్యూ కోసం ఇప్పటికే స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసిన ఓయో సంస్థ తాజాగా అదనపు పత్రాలను సమర్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ రూ. 1459 కోట్ల ఆదాయం సాధించినట్లు పేర్కొంది. అలాగే ఈ త్రైమాసికంలో రూ. 7 కోట్ల EBITDA సాధించినట్లు పేర్కొంది. కంపెనీ పాజిటివ్‌ EBITDA ప్రకటించడం ఇదే మొదటిసారి. అయితే నికర నష్టం మాత్రం రూ. 414 కోట్లుగా కంపెనీ పేర్కొంది. గత ఏడాది పూర్తి సంవత్సరానికి అంటే 2021-22లో ఆదాయం 21 శాతం పెరిగి రూ. 4781 కోట్లకు చేరిందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఐపీఓకు సెబీ నుంచి ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ అందాల్సి ఉంది.