For Money

Business News

క్రూడ్‌ భారీ జంప్‌

ధరలను అదుపులో ఉంచేందుకు క్రూడ్‌ ఆయిల్‌ సరఫరాను అదుపు చేయాలని ఒపెక్‌ దేశాలు నిర్ణయించాయి. సౌదీ అరేబియాతో పాటు రష్యా కూడా చమురు సరఫరా తగ్గించేందుకు అంగీకరించాయి. నవంబర్‌లో రోజుకు 10.5 లక్షల బ్యారెల్స్‌ చొప్పున సరఫరాను ఈ రెండు దేశాలు తగ్గిస్తాయి. మొత్తంగా అన్ని దేశాలు కలిపి రోజుకు 20 లక్షల బ్యారెల్స్‌ క్రూడ్‌ సరఫరాను కట్‌ చేస్తాయి. దీంతో మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు భారీగా పెరిగాయి. గత నెల చివరల్లో 76 డాలర్లకు చేరిన బ్రెంట్‌ క్రూడ్‌ ఇపుడు 93.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికాలో కరోనా తరవాత ఊపందుకున్న మాన్యూఫ్యాక్చరింగ్‌ తొలిసారి చల్లబడింది. వడ్డీ రేట్ల పెంపు ప్రభావం జీడీపీపై కన్పిస్తోంది. దీంతో అమెరికాతో పాటు ఇతర మార్కెట్ల నుంచి డిమాండ్‌ తగ్గే అవకాశముందని ఒపెక్‌ భావిస్తోంది. దీంతో సరఫరాను తగ్గించి.. ధరలు తగ్గకుండా చూడాలని భావిస్తోంది. ఒపెక్‌ దేశాల నిర్ణయంపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది.