For Money

Business News

ట్విటర్‌, మస్క్‌ రాజీ

ట్విటర్‌ కంపెనీని టేకోవర్‌ చేసేందుకు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌కు ప్రతిపాదన పంపినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. కోర్టు కేసును విరమించుకుంటే తాను ఇచ్చిన మాట ప్రకారం ట్విటర్‌ను కొనుగోలు చేస్తానని మస్క్‌ ప్రతిపాదించారు. దీనికి ట్విటర్‌ ఆమోదించడంతో నిన్న కోర్టు ఎదట మస్క్‌ హాజరు కాలేదు. రెండు కంపెనీల మధ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. బుధవారం నాటికి ఈ చర్చలు కొలిక్కి వచ్చే అవకాశముంది. అయితే రెండు పార్టీల మధ్య రాజీని కోర్టు ఇంకా అంగీకరించాల్సి ఉంది. అయితే ట్విటర్‌ డీల్‌ కోసం దాదాపు వంద కోట్ల డాలర్ల రుణం ఇస్తామని ఎలాన్‌ మస్క్‌కు హామి ఇచ్చిన అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌, సిక్త్‌ స్ట్రీట్‌ పార్ట్‌నర్స్‌ … వెనక్కి తగ్గాయి. దీంతో తాము కొత్త పార్టీలతో చర్చలు జరపాల్సి ఉందని, కేసు వాయిదా వేయాలని మస్క్‌ తరఫు లాయర్‌ కోర్టుకు తెలిపారు.