నాకు నోటీసు ఇవ్వలేదు.. కవిత
ఢిల్లీ మద్యం కేసులో తనకు నోటీసులు ఇచ్చినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఈ వార్తలకు ఆమె స్పందిస్తూ… తనకు ఎలాంటి నోటీసు రాలేదని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీలో కూర్చున్న కొంత మంది దురుద్దేశపూరితంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కవిత అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలు ఏమిటో తెలుసుకునేందుకు మీడియా తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించాలని ఆమె కోరారు. టీవీ ప్రేక్షకుల అమూల్యమైన సమయాన్ని కాపాడేందుకు తాను ఈ ట్వీట్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈడీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకున్నా.. తెలుగు మీడియాలో కవితకు నోటీసులు ఇచ్చినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జాతీయ మీడియాలో మాత్రం ఎలాంటి వార్తలు రాలేదు. కేవలం తెలుగు మీడియాకు మాత్రమే ఈ వార్తను ఈడీ వర్గాలు లీక్ చేశారా అన్న చర్చ ఇపుడు మీడియా వర్గాల్లో జరుగుతోంది.
The media is being misled by the malicious propaganda of people sitting in Delhi. I request all the media houses to rather utilise your time in showing the truth.
To save some precious time of the TV viewers, I would like to clarify that I have not received any notice.— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 16, 2022