For Money

Business News

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల బాటలోనే నిఫ్టి కూడా పయనించింది. చివర్లో షార్టర్ల లాభాల స్వీకరణ కారణంగా స్వల్పంగా పెరిగినా.. భారీ నష్టాలతో ముగిసింది. ఒక దశలో 17500 దిగువకు వెళ్ళినా.. 17530 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 346 పాయింట్ల నష్టంతో క్లోజైంది. నిఫ్టి రెండు శాతం నష్టపోగా బ్యాంక్‌ నిఫ్టి ఒక శాతం క్షీణించింది. అయితే నిఫ్టి మిడ్‌ క్యాప్‌ ఏకంగా మూడు శాతంపైగా నష్టపోయింది. ఇక నిఫ్టి నెక్ట్స్‌ కూడా 2.9 శాతం క్షీణించింది. నిఫ్టిలో కేవలం ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సిప్లా మినహా మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి. యూపీఎల్‌, టాటా కన్జూమర్‌, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నాలుగు శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఇన్ఫోసిస్‌ నాలుగు శాతం క్షీణించింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్లకు భిన్నంగా ఉన్న మన మార్కెట్లు ఇపుడు అంతర్జాతీయ మార్కెట్లను అనుసరిస్తున్నాయి. అత్యంత కీలక మద్దతు స్థాయిల వద్ద వాల్‌స్ట్రీట్‌ సూచీలు ట్రేడవుతున్నాయి. మరో రెండు లేదా మూడు శాతం క్షీణిస్తే … గత జూన్‌ నాటి కనిష్ఠ స్థాయిలను కోల్పోయినట్లే. అదే జరిగితే భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. పైగా ఈ నెలాఖరులో ఫెడ్‌ వడ్డీ రేట్లకు మార్కెట్ల ఎలా స్పందిస్తాయో చూడాలి.