For Money

Business News

ప్రపంచ సంపన్నుల్లో నంబర్‌ 2

అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల్లో నంబర్ 2 స్థానాన్ని ఆక్రమించారు. ఇది ఫోర్బ్స్ పత్రిక వేసిన మదింపు ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్‌. బ్లూమ్‌బర్గ్‌ బిలియనర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ఆయన రెండో స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తర్వాతి స్థానంలో గౌతమ్‌ అదానీ నిలిచారు. ఇప్పటి వరకు రెండో స్థానంలో బెర్నార్డ్ అర్నాల్డ్‌ ఉన్నారు ఫోర్బ్స్ డేటా ప్రకారం గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ కుటుంబం సంపద విలువ 15,540 కోట్ల డాలర్లుగా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.12.39 లక్షల కోట్లుకు సమానం.