For Money

Business News

17600పైన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి వస్తున్నా… మన మార్కెట్లు మాత్రం స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టితో పోలిస్తే నిఫ్టి చాలా తక్కవ నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్‌లో 17580ని తాకినా… 17632 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 86 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 39 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇతర సూచీలను చూస్తే నిఫ్టి మిడ్‌క్యాప్‌ సూచీ ఇంకా గ్రీన్‌లో ఉంది. ఈ సూచీ అర శాతం లాభంతో ఉండటం విశేషం. నిఫ్టి నెక్ట్స్‌ కూడా దాదాపు గ్రీన్‌లోకి వచ్చింది. బ్యాంక్‌ నిఫ్టి కూడా ఏక్షణంలోనైనా లాభాల్లోకి వచ్చేలా ఉంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. చాలా మంది ఇన్వెస్టర్లు 10 గంటల ప్రాంతంలో తమ పొజిషన్స్‌ను స్క్వేర్‌ చేసుకునే అవకాశముంది. కాబట్టి నిఫ్టి అసలు ట్రెండ్‌ 10 గంటల తరవాత చూడాల్సి ఉంది. అదానీ గ్రూప్‌ సిమెంట్‌ షేర్లు ఏసీసీ, అంబుజా సిమెంట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఐటీ షేర్లలో ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది.