For Money

Business News

నిలకడగా నిఫ్టి

నిఫ్టి స్థిరంగా ఉంది. ఓపెనింగ్‌లోనే నష్టాల్లోకి వెళ్ళి 17982ని తాకినా వెంటనే కోలుకుని 18033 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 30 పాయింట్లు లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ ఏ రంగం నుంచి కూడా నిఫ్టికి పెద్దగా మద్దతు లభించడం లేదు. గత కొన్ని రోజులుగా రంకెలు వేసిన బ్యాంకు షేర్లు ఇవాళ సేదతీరుతున్నాయి. ఇక ఐటీ షేర్లు కూడా నిలకడగా ఉన్నాయి. నిఫ్టి 36 షేర్లు లాభాల్లో ఉన్నమాటేగాని… అన్నీ బలహీనమే. మెటల్స్‌ ఇవాళ బలహీనంగా ఉన్నాయి. నిఫ్టికి అధిక స్థాయిలో ఒత్తిడి రానుంది. మిడ్‌ సెషన్‌ లోగానే వస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రభుత్వానికి 35 శాతంపైగా షేర్లు కేటాయించాలని ప్రతిపాదించిన వోడాఫోన్‌ ఐడియా కంపెనీ షేర్‌ పది శాతం నష్టపోయింది.