For Money

Business News

స్థిరంగా ఈక్విటీ మార్కెట్లు

ఉదయం నుంచి స్టాక్‌ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే కాస్త ఒత్తిడి వచ్చినా… వెంటనే కోలుకుని గ్రీన్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి ఇపుడు 31 పాయింట్ల నష్టంతో 17494 వద్ద కొనసాగుతోంది. నిఫ్టి బ్యాంక్‌ గ్రీన్‌లోనే ఉంది. కాస్సేపటి క్రితం ప్రారంభమైన యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అయితే లాభనష్టాలు చాలా తక్కువగా ఉన్నాయి. అనేక సూచీలు క్రితం ముగింపు స్థాయి వద్దే ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్లో ఉన్నందున.. మన మార్కెట్లు ముగిసే లోగా యూరో మార్కెట్లు పూర్తిగా లాభాల్లోకి వస్తాయేమో చూడాయి. ఇక నిఫ్టిలో అపోలో హాస్పిటల్‌ టాప్‌ గెయినర్‌గా ఉంది. ఇక హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌బో హాస్పిటల్‌ షేర్‌ 15 శాతం దాకా లాభంతో ఉంది. ఇవాళ నిఫ్టిలో బజాజ్‌ ఫైనాన్స టాప్‌ లూజర్‌. ఐఆర్‌సీటీసీ రెండు శాతం దాకా లాభాల్లో ఉంది.