For Money

Business News

నిఫ్టికి బ్యాంకుల అండ… కానీ

అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతోంది. మిడ్‌ సెషన్‌కు ముందు 17670ని తాకిన నిఫ్టి ఇపుడు 17638 వద్ద ట్రేడవుతోంది.75 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నా… ఈ స్థాయిలో నిలబడుతుందా అన్న అనుమానం మార్కెట్‌లో ఉంది. కేవలం బ్యాంక్‌ నిఫ్టి కారణంగానే నిఫ్టి ఇవాళ లాభాల్లో ఉంది. నిఫ్టి నెక్ట్స్‌ ఒక శాతం, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ 0.5 శాతం పైగా నష్టంతో ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్‌ రెండు శాతంపైగా లాభంతో ఉంది. యాక్సిస్‌ బ్యాంక్‌ 7.63 శాతం, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 3 శాతంపైగా లాభపడ్డాయి.అమెరికా ఫ్యూచర్స్‌ అర శాతం వరకు నష్టాల్లో ఉండగా, యూరో మార్కెట్లు ఒక శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారాంతాన ఈ షేర్లు అధిక స్థాయిలో నిలకడగా ఉండటం అనుమానమే.