For Money

Business News

నిఫ్టి క్లోజింగ్‌పై సస్పెన్స్‌

ఉదయం నుంచి నిఫ్టి16300పైన స్థిరంగా ట్రేడవుతోంది. మధ్యలో స్వల్ప ఒత్తిడి వచ్చి 16221కి పడినా..వెంటనే కోలుకుని ఇపుడు 16310 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 140 పాయింట్ల లాభంతో ఉంది. ఈ మధ్యకాలంలో భారీగా క్షీణించిన బజాజ్‌ ట్విన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌తోపాటు ఐటీ షేర్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి 35 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. 16300పైన నిఫ్టి నిలదొక్కుకుంటుందా లేదా లాభాల స్వీకరణ వస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అయితే పెద్దగా లాభనష్టాల్లేవ్‌. అమెరికా ఫ్యూచర్స్‌లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో నిఫ్టి ఇదే స్థాయిలో ఉంటుందా లేదా అమ్మకాల ఒత్తిడి వస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే చాలా మంది అనలిస్టులు తొలి లేదా రెండో ప్రతిఘటన స్థాయిలో మార్కెట్‌ నుంచి బయటపడమనే సలహా ఇచ్చారు.