For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మడమే…

మొన్న అమ్మినోళ్ళు అదృష్టవంతులు. ఓపెనింగ్‌లోనే కనక వర్షం. డాలర్‌ 9 నెలల గరిష్ఠ స్థాయికి చేరడంతో మెటల్స్‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అలాగే క్రూడ్‌, బులియన్‌ కూడా. ఆసియా మార్కెట్లకు కరోనా బెడద కూడా ఉంది. మూడు రోజుల్లో ఆసియా మార్కెట్లు కనీసం 3 నుంచి 4 శాతం వరకు క్షీణించాయి. ఇవాళ మన మార్కెట్లు ఎక్కడ ఓపెన్‌ అవుతాయో చూడాలి. ఎందుకంటే నిఫ్టి క్రితం ముగింపు 16,568. ఇపుడు సింగపూర్ నిఫ్టి 16,347 వద్ద ట్రేడవుతోంది. ఇదే స్థాయిలో నిఫ్టి ప్రారంభమౌతే. నిఫ్టి బేర్‌ మార్కెట్‌లోకి వెళ్ళినట్లే. ఈ రేంజ్‌ నుంచి బయటపడాలంటే నిఫ్టి కనీసం 16,460ని దాటాలి. కాని ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆసియా మార్కెట్లు ఇవాళ కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిసినా… ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉన్నాయి. సో… యూరో మార్కెట్ల ట్రెండ్‌ స్పష్టమయ్యే వరకు నిఫ్టి ఓపెనింగ్‌ స్థాయిలోనే కదలాడవచ్చు. సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో నిఫ్టి ప్రారంభమైతే… వెయిట్‌ చేయడం మంచిది. ఎందుకంటే నిఫ్టి తొలి నిరోధం 16360 ప్రాంతంలోనే ఎదురుకానుంది. ఒకవేళ ఈస్థాయిని కూడా దాటితే16400ని దాటుతుందేమో చూడండి. ఇదే జరిగితే నిఫ్టిని 16,445 స్టాప్‌లాస్‌తో 16,400పైన అమ్మొచ్చు. ఒకవేళ నిఫ్టి ఓపెనింగ్‌ను ఇంకా పడితే తదుపరి మద్దతు 16320 వద్ద అందాలి. కాని వెంటనే కొనొద్దు. ఎందుకంటే ఈ స్థాయిని కోల్పోతే నిఫ్టి 16260వరకు మద్దతు లేదు. సో… లెవల్స్‌ చూసి మీ రిస్క్‌ను బట్టి కొనండి. పెరిగినపుడు అమ్మండి. పడితే కాస్సేపు ఆగి.. కొనుగోలు చేయండి. ఎందుకంటే మెటల్స్‌లో ఇవాళ వచ్చే ఒత్తిడి తీవ్రంగా ఉండొచ్చు. రిస్క్‌ వొద్దనుకునే ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ దూరం ఉండటం బెటర్‌. నిఫ్టి సెటిల్‌ అయిన తరవాత ట్రేడ్‌ చేయొచ్చు.