రేపటికి ఈ రెండు ట్రేడ్స్ పరిశీలించండి…

దేశీయంగా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు దాదాపు లేవనే చెప్పాలి. అంతర్జాతీయ పరిణామాలే నిఫ్టి దిశ, దశను నిర్ణయించనున్నాయి. నిఫ్టిలో అప్‌ట్రెండ్ వస్తే ప్రధానంగా నిరోధం 16,600 లేదా 16,700 జోన్‌లో రావొచ్చని ఎస్ సెక్యూరిటీస్‌కు చెందిన అమిత్ త్రివేది ఎకనామిక్ టైమ్స్ పత్రికతో అన్నారు. ఒకవేళ పడితే 16,320 ప్రాంతంలో మద్దతు లభిస్తుందన్నారు. ఈ సమయంలో ఆయన రెండు ట్రేడ్‌లను ఇన్వెస్టర్లకు సిఫారసు చేశారు.
ఒకటి టీవీఎస్ మోటార్స్ ఆగస్ట్ ఫ్యూచర్స్‌ను రూ. 515-517 ప్రాంతంలో అమ్మమని సలహా ఇస్తున్నారు ఆయన. రూ. 527 స్టాప్‌లాస్‌గా ఉంచుకుని అమ్మాలి. ఆయన లెక్క ప్రకారం ఈ షేర్ రూ. 494ను తాకే అవకాశాలు ఉన్నాయి .ఈ వారంలో ఈ కౌంటర్‌లో రికవరీ వచ్చే అవకాశాలు చాలా తక్కువని, అనేక బేరిష్ క్యాండిల్స్ ఉన్నందున… రెసిస్టెంట్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన అంటున్నారు. ఆయన ఇస్తున్న మరో సిఫారసు ఆప్షన్స్‌కు సంబంధించినది. ఈ నెల 26వ తేదీతో ముగిసిన ఆగస్ట్ సిరీస్‌లో యూపీఎల్ కంపెనీకి చెందిన 730 పుట్ ఆప్షన్స్‌ను రూ. 14.5 వద్ద కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు. అదే సమయంలో అదే షేర్‌కు చెందిన రూ. 700 పుట్ ఆప్షన్‌ను రూ. 4.5 వద్ద అమ్మమని సలహా ఇస్తున్నారు. రెండూ పుట్ ఆప్షన్లే. ఈ రెండు అమ్మడం వల్ల మీ స్ప్రెడ్ రూ. 10 అవుతుంది. (రూ. 14.5 మైనస్ రూ. 4.5). రూ. 1 స్టాప్‌లాస్‌తో ఈ ఆప్షన్‌ను చివరిదాకా కొనసాగించమని అంటున్నారాయన. ఈ ఆప్షన్ రూ. 29కు చేరే అవకాశముందని ఆయన అంచనా. ఈ షేర్ పడే అవకాశం అధికంగా ఉంది. గత శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో రూ. 723 వద్ద ముగిసింది ఈ షేర్. గురువారంలోగా ఈ షేర్ రూ.700లకు వచ్చే పక్షంలో మీకు గరిష్ఠ స్థాయిలో లాభాలు దక్కుతాయి. ఈ షేర్ ఆప్షన్ లాట్ 1300.