For Money

Business News

NIFTY TRADE: భారీ మార్పులు అనుమానమే

అధిక స్థాయిల్లో నిఫ్టి తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. మార్కెట్‌ ఓవర్‌బాట్‌ పరిస్థితికి చేరుకుంది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి మద్దతు అంతంత మాత్రమే ఉంది. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది టైమ్‌ కాదు. ఇంట్రా డే లేదా వీక్లీ ట్రేడింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వండి. కొన్ని రంగాల కంపెనీలు మినహా ఏ ఒక్క కంపెనీ కూడా ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించే పరిస్థితి లేదు. కాబట్టి నిఫ్టి ఏమాత్రం పెరిగినా… సల్పకాలానికి అమ్మడానికి ప్రయత్నించండి. నిన్న నిఫ్టి 15,574 వద్ద ముగిసింది. 15528 నిన్నటి కనిష్ఠ స్థాయి. మార్కెట్‌ ఇవాల కూడా ఈ రెండు స్థాయిలు కీలకం. 15,574ని దాటితే నిఫ్టికి తొలుత 15,588 వద్ద తరవాత 15,627 వద్ద అమ్మకాల ఒత్తిడికి అవకాశం ఉంది. రిస్క్‌ వొద్దనుకునేవారు 15,600 దాటిన తరవాత నిఫ్టిని అమ్మండి. స్టాప్‌ లాస్‌ 15,640. రిస్క్‌ తీసుకునేవారు 15,590 ప్రాంతంలోనే అమ్మొచ్చు. నిన్నటి కనిష్ఠ స్థాయి అయిన 15,528కి దిగువకు వస్తే వెయిట్‌ చేయండి.15,500 వద్ద కొనుగోలుకు ఛాన్స్‌ రావొచ్చు. మార్కెట్‌ బలహీనంగా ఉంటే 15,485ని కూడా నిఫ్టి తాకొచ్చు. ఈ స్థాయిలో స్టాప్‌లాస్‌ 15,430గా కొనుగోలు చేయొచ్చు. రిస్క్‌ వొద్దనుకునేవారు…అమెరికా ఫ్యూచర్స్‌ ఇంకా బలహీనంగా ఉండటంతో… అధిక స్థాయిలో అమ్మడానికే ప్రాధాన్యం ఇవ్వండి. బుల్స్‌ మాత్రం నిఫ్టి పడితే కొనుగోలు చేయమని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టు సుదర్శన్‌ సుఖాని సిఫారసు చేస్తున్నారు. 15450 ప్రాంతంలో కొనుగోలు చేయమని మరో అనలిస్ట్‌ మితేస్‌ టక్కర్‌ సలహా ఇస్తున్నారు.