For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లలో ముఖ్యంగా ఐటీ, టెక్‌ షేర్లలో తుపాను వచ్చి వెళ్ళింది. 2.5 శాతం నష్టంతో ప్రారంభమైన నాస్‌డాక్‌ చివరికి గ్రీన్‌లో క్లోజ్‌ కావడం విశేషం. ఇతర సూచీలు కూడా ఒకటిన్నర శాతం నష్టంతో ప్రారంభమయ్యాయి. చాలా వరకు నష్టాలను పూడ్చుకున్నా… డౌజోన్స్‌ 0.45 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.14 శాతం నష్టంతో క్లోజయ్యాయి. ఇక ఆసియా మార్కెట్ల విషయానికొస్తే సెలవుల తరవాత ఓపెనైన నిక్కీ ఒక శాతం వరకు నష్టంతో ఉంది. దాదాపు ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌ సెంగ్‌ ఒక్కటీ గ్రీన్‌లోకి వచ్చింది. కాని లాభాలు నామ మాత్రంగానే ఉన్నాయి. చైనాలో కీలక డేటా ఇవాళ రానుంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి స్వల్ప నష్టంతో ఉంది. చూస్తుంటే నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.