For Money

Business News

BUDGET: స్టాండర్డ్‌ డిడక్షన్‌ మొత్తం పెంపు?

ఈసారి బడ్జెట్‌లో ఐటీ స్లాబ్‌ల జోలికి ఆర్థిక మంత్రి వెళ్ళరని తెలుస్తోంది. స్లాబులను అలాగే ఉంచి… ఉద్యోగులను సంతృప్తి పర్చడం కోసం స్టాండర్డ్‌ డిడక్షన్‌ను పెంచే ఆలోచన చేస్తోందని ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఇపుడు స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి రూ. 50,000. మరో 30 నుంచి 35 శాతం పెంచే అవకాశముంది. అంటే 15000 లేదా రూ.17000 వరకు పెంచే అవకాశముందని తెలుస్తోంది. కోవిడ్‌ సమయంలో ధరలు పెరగడంతో పాటు వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగుల స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంచాలని అనేక పారిశ్రామిక సంస్థల సంఘాలు కూడా ఆర్థిక మంత్రిని కోరాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా ఉద్యోగుల ఇంటి ఖర్చు పెరిగిందని వీరు అంటున్నారు. పన్ను వసూళ్ళ స్థితిని చూసి ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకునే అకవాశముంది. పాత పన్ను పద్ధతిని ఎంచుకున్నవారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే కొత్త పన్ను పద్ధతిలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ ప్రస్తావన లేదు.