For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఒమైక్రాన్‌ భయం పెరుగుతోంది. క్రిప్టో కరెన్సీలో ప్రారంభమైన అమ్మకాల ఒత్తిడి ఇంకా కొనసాగుతుందా లేదా ఆగుతుందా అన్న చర్చ కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా టెక్‌ షేర్లలో వస్తున్న అమ్మకాల ఒత్తిడి ఇతర మార్కెట్లను పునరాలోచనలో పడేసింది. శుక్రవారం అమెరికా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నా… టెక్‌ సూచీ ఏకంగా రెండు శాతం వరకు నష్టపోయింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. చైనా మార్కెట్లు మాత్రమే కాస్త గ్రీన్‌లో ఉన్నాయి. మిగిలిన మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఇక ఇతర ప్రధాన మార్కెట్ల విషయానికొస్తే జపాన్‌ నిక్కీ 0.56 శాతం, హాంగ్‌సెంగ్‌ 1.31 శాతం క్షీణించింది.న్యూజిల్యాండ్‌ మార్కెట్‌ కూడా ఒక శాతం నష్టంతో ఉంది. సింగపూర్ నిఫ్టి స్థిరంగా ఉంది. మరి నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభమౌతుందా లేదా నష్టాలతో ప్రారంభమౌతుందా అన్నది చూడాలి.