For Money

Business News

NIFTY TODAY: పెరిగే వరకు ఆగండి

సింగపూర్‌ నిఫ్టి గ్రీన్‌లో ఉంది. కాని నిఫ్టి ఓపెనింగ్‌ వరకు ఇదే స్థాయిలో ఉంటుందా అన్నది అనుమానమే. నిఫ్టి డే ట్రేడింగ్‌ విషయానికొస్తే …. నిఫ్టి క్రితం ముగింపు 17,196. నిఫ్టి 17250 దాటితే అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. నిఫ్టికి 17290 కీలకం. ఈ స్థాయి వద్దే నిఫ్టికి అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. పొరపాటున నిఫ్టి గ్రీన్‌లోకి వస్తే 17,300 ప్రాంతానికి చేరితే అమ్మండి. నిఫ్టికి 17200 ప్రాంతంలోనే ఒత్తిడి రావొచ్చు. నిఫ్టికి 17100 లేదా 17055 ప్రాంతంలో మద్దతు వస్తుందేమో చూడండి. కాస్సేపు వెయిట్‌ చేయండి. నిఫ్టి మరింత బలహీన పడితే 17000ని తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. శుక్రవారం భారీగా క్షీణించిన అమెరికా మార్కెట్లు ఇపుడు కాస్త గ్రీన్‌లో ఉన్నాయి. ఫ్యూచర్స్‌ 0.5 శాతం లాభపడినా.. యూరో మార్కెట్లు నష్టాల్లోనే ప్రారంభమయ్యే అవకాశముంది. మన మార్కెట్‌పై యూరో మార్కెట్ల ప్రభావం ఉండే అవకాశముంది. యూరో మార్కెట్లు నామమాత్రపు నష్టాలతో ట్రేడవుతే…మన మార్కెట్లు నష్టాలను తగ్గించుకోవచ్చు. మనదేశంలో కూడా ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి దిగువ స్థాయిలో కొనుగోలు చేసే బదులు… అధిక స్థాయిలో స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో అమ్మడమే బెటర్‌.